మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు అమెరికాలో వేగంగా జరుగుతున్నాయి. అవయవ కొరత అధిగమించేందుకు అక్కడి శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పంది కాలేయంలోని కణాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. అనంతరం మనుషులకు ఉపయోగపడని దానం చేసిన కాలేయం నుంచి కణాలను పంది కాలేయంలోకి చేరుస్తారు. తర్వాత మనిషి శరీరం బయటే కృత్రిమంగా ఈ కాలేయం రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తుందో పరీక్షించనున్నారు.