దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు నష్టపోయి 60,784 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 18,086 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.83 వద్ద ట్రేడవుతోంది. పవర్ గ్రిడ్, టైటన్, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, మారుతీ, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్ , టెక్ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్ టెల్, రిలయెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.