ముద్దనూరులో విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసినట్లు ముద్దనూరు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మునిరాజరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ బాలుర ఉన్నత పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 88, టీచర్లకు 11 ట్యాబ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరూ లక్ష్యాల మేరకు చదువుకొని ఉన్నత స్థితికి చేరుకొని, జీవితంలో స్థిరపడే వరకు జగనన్న ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు.