కేరళలోని శబరిమల ఆలయంలో 41 రోజుల మండలపూజ ముగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు, ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. నిన్న రాత్రి భక్తుల దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేశారు. కాగా, ఈ 41 రోజుల్లో 30లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. గత 39 రోజుల్లో రూ.222.98 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ బోర్డు తెలిపింది. ఈ నెల 30న మకరవిలక్కు ఉత్సవాల కోసం తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరవిలక్కు ఉత్సవాల అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.