విద్యార్థులకు టాబ్ లను పంపిణీ చేసిన సర్పంచ్ పిల్ల రాము. లావేరు మండలం గోవిందపురం పంచాయతి ఇజ్జాడపాలేం గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. విధ్యార్ధులతో మమేకమై ఉపాధ్యాయుల బోధనా విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్ధులకు విద్యను సులభతరం చేసేందుకు 8, 9 తరగతి విధ్యార్ధులకు ఏర్పాటు చేసిన టాబ్ లను పంపిణీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకుని జగనన్న ఆసయాలను నెరవేర్చాలని సూచించారు.