ఈనెల 29వ తేదీ పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లను రద్దు చేస్తున్నట్లు ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలాస-విశాఖపట్నం మధ్య ట్రైన్ లైన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నందున రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రద్దయిన వాటిలో పలాస-విశాఖపట్నం, గుణుపూర్-విశాఖపట్నం, భువనేశ్వర్ ఇంటర్సిటీ, విశాఖపట్నం-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించగలరు అని ఈ ప్రకటనలో కోరారు.