ఏపీలో ఈ ఏడాది క్రైం రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. పెండింగ్ కేసుల సంఖ్య కుడా చాలా తగ్గిందని తెలిపారు, లోక్ అదాలత్ ల ద్వారా 57 వేల కేసులకు పరిష్కారం లభించిందని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లో 44 మందికి శిక్ష పడిందని వివరించారు. 2021 కంటే 22లో దాదాపు 60 వేల కేసులు తగ్గాయని తెలిపారు. 169 పీడీయాక్టులు నమోదు చేశామని, హత్యలు 945 నుండి 857కు తగ్గాయని డీజీపీ వెల్లడించారు.