విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వార్డు మాధవదార జీవీఎంసీ హై స్కూల్ లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు
విద్యార్థులుకు ట్యాబ్ లు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ అమ్మ ఒడి నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరు ముద్ద లాంటి పథకాలతోపాటు ఇప్పుడు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ ఇలా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న అద్భుత అవకాశాలను విద్యార్థులంతా సద్విని యోగపర్చుకోవాలని చెప్పారు.