భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 188 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజే 141 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,20,298 కేసులు నమోదు కాగా.. ఒక్కరోజులోనే 963 మరణాలు సంభవించాయి.