ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కాగా, ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా... ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.తమ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకపోయినా గత ప్రభుత్వం చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో, ఇటువంటి ఆంక్షలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఇందులో జోక్యం చేసుకోవాలని సిఎం జగన్ ప్రధాని మోడీని కోరారు.