కందుకూరుచంద్రబాబు సభలో అపశృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తమ కుటుంబసభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు అని లోకేష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేష్ చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.