శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం పోలీస్ స్టేషన్ నందు ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన మొత్తం 48 వాహనాలలో 41 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు మరియు 4 కార్లు వీటిని ఈ నెల వ తేదిన రొద్దం పోలీస్ స్టేషన్ నందు పెనుకొండ సెబ్ అధికారుల ఆధ్వర్యం లో బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇందుకు సంభందించిన వివరాలను తెలుసుకొనుటకు గాను రొద్దం పోలిస్ స్టేషన్ ని సంప్రదించి, వివరాలను తెలుసుకొనగలరని వేలం పాటలో పాల్గొనదలచినవారు తగిన ధరావత్తు చెల్లించి దానికి తగిన రశీదు పొంది వేలం పాటలో పాల్గొనగలరని, వేలం పాటలో పాల్గోనదలచినవారు వారి అధార్ వెంట తెచ్చుకొని అధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వవలెనని తెలిపారు.