నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు.. పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతోపాటు అక్రమ నిధుల కేసులో తిరువనంతపురం, కొల్లాం, పటానంతిట్ట జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇప్పటికే వంద మందికిపైగా పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.