ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 39 వ వార్డులో బుధవారం రూ. 20 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి నాగరాజు, కౌన్సిలర్ చింపిరి అనిల్, వైసీపీ నాయకులు పోసా భాస్కర్, పల్లా సురేష్, అంజి, తదితరులు పాల్గొన్నారు.