మైలవరం డ్యామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న పల్లా గోవర్ధన్, పల్లా వరలక్ష్మి దంపతుల కుమారులను, కుటుంబ సభ్యులను జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి పరామర్శించారు. గురువారం దొమ్మర నంద్యాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన ఆయన గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల ఉన్నత చదువులకు, ఉజ్వల భవిష్యత్‌కు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.