పరవాడ వైసీపీ మూడున్నరేళ్లపాలన అంతా అవినీతి మయంగా మారిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మండలంలోని పి. భోనంగి గ్రామంలో బుదవారం రాత్రి మాజీ సర్పంచ్ రాయవరపు దేముడు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. బండారు మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్నిరంగాలు కుదేలయ్యాయన్నారు. రాష్ట్రాభివృద్దిని వైసీపీ పదేళ్లు వెనక్కు నెట్టేసిందన్నారు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు వెళ్లగొట్టడంతో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. గ్రామాల్లో అబివృద్ది అనేదే కనిపించలేదన్నారు. ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా కబ్జాలకు గురవు తున్నాయన్నారు. చివరకు స్థానిక పరిశ్రమల్లోని కాంట్రాక్టు ఉద్యోగాలను సైతం అమ్ముకునే స్థాయికి వైసీపీ పాలకులు దిగజారారని ఆరోపించారు. ఇటువంటి దుర్మార్గపు వైసీపీ పాలనకు స్విస్థి పలికేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని బండారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యధర్శి బండారు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు వియ్యపు చిన్న, బీసీ సెల్ కార్యదర్శి అట్టా సన్యాసప్పారావు, నాయకులు బొండా తాతారావు, రాయవరపు పైడితల్లి, ఇందల కొండలరావు, కూండ్రపు శ్రీరామ్మూర్తి, పైల వరలక్ష్మి, పైల చినక్కునాయుడు, పైల రమాకుమారి, కొత్తపల్లి అపర్ణ తదితరులు పాల్గొన్నారు.