టీడీపీ అధినేత చంద్రబాబు కందురూరులో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. చంద్రబాబు సభకు భారీగా కార్యకర్తలు హాజరవ్వడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిలబడేందుకు కూడా స్థలం లేదు. దీంతో కొందరు పక్కనే ఉన్న రేకుల షెడ్డు ఎక్కడంతో అది కూలిపోయింది. రేకుల షెడ్డు పైనున్న వారు కింద నిల్చున్న వారిపై పడటంతో గందరగోళం ఏర్పడి చుట్టుపక్కన వారు పరుగులు తీశారు. దీంతో కొందరు కాలువలో పడిపోగా, తొక్కిసలాట జరగడంతో 8 మంది మరణించారు.