నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ లో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.