స్వదేశీ, విదేశీయులపై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా, అక్కడి నుంచి వచ్చేవారిపై రేస్ట్రిక్షన్స్ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరింది. చైనా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలని నిబంధన పెట్టింది. పుట్టినింట్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ప్రయాణానికి రెండు రోజుల ముందు పీసీఆర్ టెస్ట్ చేసుకోవాలని, నెగెటివ్ రిపోర్ట్ ఉండాలని అధికారులు స్పష్టంచేశారు.