అగ్రరాజ్యం అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను చంపాలని అమెరికా ప్లాన్ చేస్తోందంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. రష్యాపై పశ్చిమ దేశాల విధానం అత్యంత ప్రమాదకరమైనదని ఆయన అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికాలో పర్యటించిన సమయంలో ఈ దిశగా సమాలోచనలు జరిగాయని పేర్కొన్నారు.