గూగుల్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు జారీ చేసింది. పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన పెనాల్టీని గడువు ఈ నెల 25నే ముగియటంతో ఈ నోటీసులు జారీ చేసింది. కాగా గూగుల్‌కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్ చివర్లో రెండు ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు గూగుల్ సవాల్ చేసింది. వీటిపై ట్రిబ్యునల్ ఇంకా విచారణ నిర్వహించాల్సి ఉంది.