చైనాలో కరోనా వైరస్ ఉగ్రరూం దాల్చుతుంది. అయితే చైనాలో కరోనా పరిస్థితిపై, రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయని, స్మశానాల వద్ద భారీ క్యూలు ఉంటున్నాయని, కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడిందని వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను చైనా యథావిధిగా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలంటూ ఫైర్ అయింది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచామని, దశలవారీగా వైరస్ విజృంభిస్తోందని చెప్పింది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోందని అని విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు.