ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుందని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని, నిన్న రాత్రి నుండి ఓరల్ డైట్ ప్రారంభమయిందని సీఎం కార్యాలయం వెల్లడించింది.