లిఫ్ట్‌లో పనిమనిషిపై అమానవీయంగా దాడి చేసిన షెఫాలీ కౌల్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నొయిడాలో అనిత అనే 20 ఏళ్ల యువతి షెఫాలీ ఇంట్లో 6 నెలల కోసం పనిమనిషిగా కుదిరింది. ఆక్టోబర్ 31తో వారి ఒప్పందం ముగిసింది. అయినా అనితను షెఫాలీ వదిలిపెట్టలేదు. అంతేకాక రోజూ ఎక్కువ గంటలు పనిచేయించుకునేదని, చేయనంటే కొట్టేదని బాధితురాలు పేర్కొంది. ఓ సారి ఇంట్లో బెల్లం తింటే తనను చెప్పుతో కొట్టినట్లు ఆరోపించింది. ఈ క్రమంలోనే అనిత పారిపోతుండగా ఆమెను షెఫాలీ లిఫ్ట్ నుంచి ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆరోజు నుంచి షెఫాలీ కనిపించకుండాపోయింది. ఈ క్రమంలోనే తీవ్రంగా గాలించిన పోలీసులు ఆమెను గతరాత్రి అరెస్టు చేశారు.