అన్న మృతిచెందిన గంటల వ్యవధిలోనే తమ్ముడూ మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా, సీతానగరం మండలం బీకేపురంలో గురువారం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్ళితే..... గ్రామానికి చెందిన గుంట పాదాలు(80), గుంట అప్పలస్వామి (78) అన్నదమ్ములు. ఇద్దరకూ పిల్లలు ఉన్నారు. పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో పాదాలు వయోభారంతో మృతిచెందాడు. అంత్యక్రియలు అనంతరం.. ఇదే విషయాన్ని అప్పలస్వామి హైదరాబాద్లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు గమనించేసరికి మృతిచెందాడు. ఒకేరోజు అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.