ఏపీలోని ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. డేటాబేస్ సర్వీస్ మైగ్రేషన్ చేస్తున్నందున ఫీజులు చెల్లించేందుకు ఆన్ లైన్ సేవలు జనవరి 2 వరకు పనిచేయబోవని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అందువల్ల ఇంటర్ పరీక్షల ఫీజు గడువును రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 4 వరకు పొడిగించినట్లు బోర్డు వెల్లడించింది. అంతేకాకుండా 2022-23 సంవత్సరానికి అఫిలియేషన్ ఫీజు చెల్లింపు గడువును జనవరి 4 వరకు పొడిగించినట్లు తెలిపింది.