ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు విజ్ఞప్తి చేసింది. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్–19 మేనేజ్‌మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఈ ఆదేశాలు జారీ చేశారు.