ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ సీఎం భూపేంద్ర, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.