పొరపాటున అకౌంట్లో పడ్డ రూ.1.28 కోట్లను ఖర్చు పెట్టిన భారతీయుడికి దుబాయ్ కోర్డు జైలు శిక్ష విధించింది. యూఏఈకి చెందిన ఓ మెడికల్ కంపెనీ తన వ్యాపార భాగస్వామికి రూ.1.28 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే ఆ నగదు పొరపాటున అక్కడే ఉంటున్న భారతీయుడి ఖాతాలో జమయింది. దాన్ని గమనించిన వ్యక్తి అవి ఎక్కడనుండి వచ్చాయో తెలుసుకోకుండా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ నగదును తిరిగివ్వాలని సదరు కంపెనీ విజ్ఞప్తి చేయగా అతడు నిరాకరించాడు. దీంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దుబాయ్ క్రిమినల్ కోర్టు సదరు వ్యక్తికి జరిమానా, నెల రోజుల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా శిక్ష ముగిసిన వెంటనే దేశం నుండి వెళ్లిపోవాలని ఆదేశించింది.