బరమ శివన్నారాయణ అనే భారతీయ అమెరికన్ ఐటీ నిపుణుడు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాడు. ఓ కంపెనీ అంతర్గత సమాచారాన్ని అక్రమంగా సంపాదించి స్టాక్‌మార్కెట్‌లో 73 లక్షల డాలర్ల లాభాలను పొందాడని నిర్ధారణ అయింది. అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు. శివన్నారాయణ కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. తరవాత పాలో ఆల్టో నెట్‌వర్క్స్ అనే కంపెనీకి కాంట్రాక్టర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో సంస్థ ఐటీ విభాగంలో పరిచయమైన వ్యక్తితో కలిసి శివన్నారాయణ ఈ అక్రమానికి పాల్పడ్డారని ఆధారాలు లభించాయి.