ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.