లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డబ్బు ఆదా కోసం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పేరుతో ఓ పాలసీని తీసుకు వచ్చింది. ప్రతి రోజూ రూ.100 చొప్పున పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ బోనస్ వస్తుంది. రాబడికి హామీ ఇవ్వడమే కాకుండా బీమా కవరేజీ కూడా ఇస్తోంది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఈస్కీమ్లో వార్షిక ప్రీమియంగా రూ. 27,000 డిపాజిట్ చెయ్యాలి. నెలవారీ ప్రీమియం దాదాపు రూ. 2300 గా ఉంటుంది. 21 ఏళ్ల లో దాదాపు రూ.5.60 లక్షలు జమ అవుతాయి. బోనస్‌తో కలిపి మొత్తం మీకు పది లక్షలు వస్తాయి.