టీమిండియా యువక్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ‘రిషబ్ పంత్ ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. పరీక్షలన్నీ పూర్తైన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం. రిపోర్ట్స్ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.