కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ కేంద్ర మంత్రిని జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. రాహుల్ చేపట్టిన జోడో యాత్రకు నియోజకవర్గంలోని ప్రముఖులను ఆహ్వానించాలంటూ పార్టీ తమను ఆదేశించిందని దీపక్ చెప్పారు. ఈ క్రమంలోనే అమేథీ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని యాత్రకు ఆహ్వానించినట్లువివరించారు.