తమలపాకులు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. 10 తమలపాకులకు తగినంత నీటిని కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. దానికి 3 చెంచాల నెయ్యి, చెంచాన్నర తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు పట్టించి మృదువుగా మర్దనా చేసి అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇది మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలే సమస్యను పోగొట్టి, జుట్టు పెరిగేలా చేస్తుంది.