ఏపీ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీజేఐ తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని, సాంకేతికను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని తెలిపారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలని పేర్కొన్నారు.