మహారాష్ట్ర ముంబైలో దారుణం జరిగింది. శివాజినగర్లో అద్దెకు ఉంటున్న నలుగురు వ్యక్తులు ఇంటి యజమానికి కొంత డబ్బుు ఇచ్చారు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవటంతో అతనిపై దాడికి దిగి చితకబాదారు. గోడకేసి బాది అనంతరం నోట్లో బలవంతంగా పినాయిల్ పోశారు. దీంతో అతని పేగులు కాలి తీవ్ర కడపునొప్పితో ఇబ్బందిపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.ఈ ఘటనలో నలుగురు నిందితులపై హత్యాహత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.