కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కల్పించడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలు, సలహా మేరకు పది రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం గతేడాది ప్రారంభించడం జరిగిందన్నారు. అదే సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటిస్తున్నామని చెప్పారు.