మార్టూరు లోని అంబేద్కర్ నగర్ లో నివసించే పల్లపాటి జానీ(21)అనే యువకుడు గురువారం సాయంత్రం తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుడు చిలకలూరిపేటలో పశువైద్యానికి చెందిన ప్రభుత్వ మొబైల్ వాహనంలో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జానీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసేసరికి జానీ విగత జీవిగా మిగిలాడు. జానీ ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియ రాలేదు. పోలీసులకు సమాచారం అందగా వారు విచారణ చేపట్టారు.