ఢిల్లీ పర్యటన లో ఏం సాధించారో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ‘‘జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి అర్జీలు ఇచ్చారు. ఇటువంటి అర్జీలు ఇవ్వడం జగన్కు కొత్తేమీ కాదు.. కానీ ఫలితాలు రావడం లేదు. జగన్ కోరిన కోర్కెలపైన కేంద్ర మంత్రుల నుంచి స్పందన లేదు.. ప్రకటనా ఉండటం లేదు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం స్పందించలేదు. జగన్ ఢిల్లీకెళ్లేమో పోర్టు ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన ఇవ్వకుండా మోడీ, జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు.’’ అని విమర్శించారు.