‘చంద్రబాబు ను చూడాలని ఉంది.. ఒక్కసారి మా ఊరికి వచ్చి వెళ్లమనండి’ అంటూ టీడీపీ నేతలను ఓ వృద్ధురాలు కోరింది. ఆక్వా రైతులు , వ్యవసాయదారుల సమస్యలపై ఏలూరు జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నిన్న రాత్రి కాళ్లమండలం, ఆనందపురం వెళ్లారు. అదే సమయంలో రామరాజు మాట్లాడుతుండగా.. ఓ వృద్ధురాలు అక్కడికి వచ్చి ఈ మాట అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నోసార్లు ఆమె టీడీపీకి ఓటు వేశారని, అందుకే అడిగే హక్కు ఆమెకు ఉందన్నారు. చంద్రబాబు ప్రతినిధిగా ఇక్కడికి వచ్చామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa