పెద్దవడుగూరు: రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త సమష్టి పార్టీ కోసం పని చేస్తే విజయం మనదేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ పేర్కొన్నారు. శుక్రవారం దివాకర్ ఫంక్షన్ హాలులో సచివాలయ కన్వీనర్, వలంటీర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో వైఎస్సా సీపీ అఖండ మెజార్టీతో గెలవాలంటే ప్రతి కార్యకర్త, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్ నిర్విరామంగా పని చేయాలన్నారు. గతంలో తాడిపత్రి నియోజక వర్గ పాలకుల వద్దకు రైతులకు సాగు నీరు అందించాలని కోరితే నాజోబిలో లేవు అని ఎద్దేవా చేసేవారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గుర్తు చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత మెండుగా వర్షాలు కురవడం తో డ్యాంలు, చెరువులు వర్షం నీటిలో కళకళలాడుతున్నాయన్నారు. పెద్దవడుగూరు మండల రైతులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వరకూ సాగు నీరు అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తు న్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నిన్నా రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్య మన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్న పూస రవీంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్లు విడుదల చేశారు.