వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్న ఉత్తర కొరియా, మరోసారి బలప్రదర్శణకు దిగింది. అంతర్జాతీయంగా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా తగ్గేది లేదంటుంది. శనివారం ఉదయం మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది కిమ్ ప్రభుత్వం. క్షిపణికి చెందిన ఐదు డ్రోన్లు తమ గగనతలంలోకి దూసుకొచ్చాయని దక్షిణ కొరియా తెలిపింది. కాగా, ఉత్తర కొరియా ఏడాదిగా మిస్సైళ్లు, అత్యాధునిక ఖండాంతర క్షిపణులు, ఆయుధాలను పరీక్షిస్తుండటంతో కొరియన్ పీఠభూమిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.