ఈనెల 28 న తేదీ కందుకూరు లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు సభలో జరిగిన దుర్ఘటన వలన 8 మంది టిడిపి కార్యకర్తలు మృతి చెందారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ. లింగసముద్రం మండలం చిన్నపవని లో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.