గుంటూరు జిల్లాలో ఓ అగంతకుడు మహిళా మెడలోని బంగారు గొలుసు తెంచుకు వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యామలానగర్ 3వ లైన్ కు చెందిన కాళేశ్వరరావు, అతని భార్య అరుణకుమారి శుక్రవారం సొంత పనుల నిమిత్తం 8వ లైన్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఓ అగంతకుడు అరుణకుమారి మెడలోని 70 గ్రాముల గొలుసు తెంచుకొని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. దంపతులు ప్రతిఘటించిన ఫలితం లేకపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.