తెనాలి మండలం కట్టేవరం గ్రామానికి చెందిన మహిళ పట్టణ బస్టాండ్ సమీపంలోని ఏటీఎమ్ మిషన్ వద్దకు వచ్చి తనకు నగదు డ్రా చేయడం తెలియకపోవటంతో, అక్కడ ఉన్న వ్యక్తి తో రూ. 18, 000 డ్రా చేయించారు. అనంతరం అతను ఏటీఎమ్ కార్డును మార్చేసి తన వద్ద ఉన్న మరో కార్డును ఆమెకు ఇచ్చి, తదుపరి ఆమె ఖాతా నుంచి రూ. 52000 డ్రా చేశాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు శుక్రవారం తెలిపారు.