తెలుగంగ పథకంలో భాగమైన వెలుగోడు జలాశయంలో శనివారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మత్స్యశాఖ నంద్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో 2022- 23 సంవత్సరాలు సంబంధించి 9. 5 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వెలుగోడు జలాశయంలో ఆయన పలు రకాల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.