సంక్రాంతి లక్కీ డిప్ పేరిట లాటరీ నిర్వహిస్తూ పేద ప్రజలను మంత్రి అంబటి రాంబాబు దోచుకుంటున్నారని జనసేన నాయకులు గాదె వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రంలో జూదం నిషేధం అయినా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాత్రం స్వయంగా మంత్రి వాలంటరీల సహాయంతో లాటరీ టికెట్లు రూ. 100 చొప్పున అమ్ముతున్నారన్నారు. వెంటనే అంబటి పై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.