ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం తొడకొట్టారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌కే ఓటేస్తానని ఓ మహిళ తొడకొట్టి చెప్పిందంటూ ఆమెను అనుకరిస్తూ అయన కూడా తొడకొట్టారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.గోవిందరావు అధ్యక్షతన నిన్న కన్వీనర్లు, వలంటీర్లతో సభ జరిగింది. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖలు చేసారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.నారవారీ గ్రామంలో రెండు ఎకరాల భూమిని కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బిలియనీర్ బిలియనీర్ ఎలా అయ్యారని ప్రశ్నించారు.