ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పేలింది. పేలుడు ధాటికి ఆసుపత్రి భవనం అద్దాలు, చుట్టుపక్కల ఇళ్లకున్న అద్దాలు ముక్కలయ్యాయి. ఇద్దరి మృతదేహాలు చెల్లా చెదురుగా రోడ్డు మీద పడ్డాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.